రిపోర్టర్, సంగారెడ్డి | 9000600737
Latest posts by MOHAMMAD MOHAMMAD
(see all) వైద్య చికిత్స నిమిత్తం జహీరాబాద్ పట్టణంలోని రామ్‌నగర్‌కు చెందిన రాసూరి సుందర్ పాల్‌కు రూ.1,10,000 విలువైన ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాలను జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గురువారం తన క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులకు అందజేశారు….ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులతో మెరుగైన వైద్యం పొందలేని పేదలకు ప్రభుత్వం ద్వారా అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ తంజిం, మాజీ సర్పంచ్ రాజశేఖర్, అభిషేక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.