జనగామలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
- రాజ్యాంగ పరిరక్షణ సమరభేరి.. హైదరాబాద్కు జనగామ కాంగ్రెస్ సేవాదళ్ శ్రేణుల తరలింపు - November 27, 2026
- ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి - November 27, 2026
- భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి - November 27, 2026
జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బంధారపు యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు చౌడ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం లభించాయని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గంధం రాములు, పడమటింటి దుర్గారాజు, జిల్లా కార్యదర్శులు మోత జనార్ధన్, మారేపల్లి రవి, వెంకన్న, జి. విష్ణు, ఎస్సీ మోర్చా జిల్లా కోశాధికారి తుడుముల అనిల్ తదితరులు పాల్గొన్నారు.
