జాఫర్‌ఘడ్ సబ్ మార్కెట్ యార్డును అభివృద్ధి చేసి రైతుల సమస్యలు పరిష్కరించాలి
- విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నవీన్ చారి - September 27, 2026
- జాఫర్‌ఘడ్ సబ్ మార్కెట్ యార్డును అభివృద్ధి చేసి రైతుల సమస్యలు పరిష్కరించాలి - September 27, 2026
- డీసీసీ కార్యాలయంలో ఘనంగా సేవాదళ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ - September 27, 2026

జాఫర్‌ఘడ్ మండలంలోని టి.బి. తండా సమీపంలోని సబ్ మార్కెట్ యార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో యార్డును సందర్శించారు. యార్డు ప్రహరీ గోడలు శిథిలావస్థకు చేరాయని, వెనుక గోడ కూలిపోయినా మరమ్మతులు చేపట్టలేదన్నారు. గోదాంలో సుమారు 5 లక్షల కిలోల రేషన్ బియ్యం నిల్వ ఉన్నప్పటికీ సీసీ రోడ్లు, కెమెరాలు, గేటు వంటి సౌకర్యాలు లేవన్నారు. రైతులు పంటల విక్రయానికి ఘనపూర్ మార్కెట్‌కు వెళ్లాల్సి వస్తోందని, స్థానిక యార్డులోనే కొనుగోళ్లు ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
