కార్తీక మాసం రెండవ సోమవారం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న డీసీపీ రాజమహేంద్ర నాయక్ దంపతులు.

జనగామ జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డ కాలనీలో గల శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో జనగామ జిల్లా డీసీపీ రాజమహేంద్ర నాయక్ (ఐపీఎస్) దంపతులు పాల్గొన్నారు. తొలుత శివపార్వతుల పల్లకీ సేవలో పాల్గొన్న డీసీపీ దంపతులు, అనంతరం కార్తీక మాస ప్రత్యేక ఆకర్షణగా నిర్వహించిన ఆకాశ జ్యోతిని వెలిగించారు. అనంతరం శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు.WhatsApp Image 2026-11-23 at 20.02.53.jpeg

You may also like...