ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
- ఘనంగా జనగామ జిల్లా పంచర్ షాప్ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం - November 15, 2026
- ఐక్యంగా ఉద్యమించాలి: జిల్లా సంయుక్త కార్యదర్శిగా యామంకి విజయ్ నియామకం - November 14, 2026
- బాలల హక్కులు, విధులు, బాధ్యతలపై అవగాహన - November 14, 2026

జనగామ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం చాచా నెహ్రూ, గ్రంథాలయ పితామహుడు ఎస్.ఆర్. రంగనాథన్, సరస్వతి దేవి చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు స్టేషన్ ఘన్పూర్, జఫర్గఢ్ గ్రంథాలయాలకు నూతన భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లాలోని గ్రంథాలయాల్లో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రంథాలయానికి రావాల్సిన సెస్సు నిధులను మున్సిపాలిటీ నుంచి ఎప్పటికప్పుడు జమ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ వంగ ఉమా యుగేందర్, 10వ వార్డు కౌన్సిలర్ రజనీ క్రాంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం. సుధీర్, జిల్లా కేంద్ర గ్రంథాలయ అధికారి టి. మధుసూదన్ రెడ్డి, గ్రంథపాలకులు సీహెచ్. రవి, బి. పద్మారావు, గ్రంథాలయ సిబ్బంది, మండల గ్రంథాలయాల ఇన్చార్జిలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
