చిలుకూరి కొండమ్మ గారి భౌతికదేహానికి నివాళులు అర్పించి కుటుంబానికి పరామర్శ
- చిలుకూరి కొండమ్మ గారి భౌతికదేహానికి నివాళులు అర్పించి కుటుంబానికి పరామర్శ - September 13, 2026
దేవరుప్పుల: దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన చిలుకూరి నారాయణ, చంద్రమౌళి గార్ల తల్లి చిలుకూరి కొండమ్మ గారు ఈరోజు ఉదయం మృతి చెందగా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మండల ముఖ్య నాయకులు సుందర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్ వారి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఏల సుందర్ మాట్లాడుతూ… కొండమ్మ మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ మండల నాయకులు యువజన నాయకులు బంధుమిత్రులు, గ్రామస్తులు పాల్గొని కొండమ్మ కు నివాళులర్పించారు.
