లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ ఆధ్వర్యంలో విద్యార్థినికి సైకిల్ వితరణ

1000202884.jpg

లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ ఆధ్వర్యంలో, రీజన్ చైర్మన్ లయన్ డా. జైన రమేష్ సహకారంతో పాఠశాల విద్యార్థినికి సైకిల్ అందజేశారు. పాఠశాలకు ప్రతిరోజూ రాకపోకలకు సైకిల్ ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థిని ఆనందం వ్యక్తం చేసింది. సైకిల్ అందడంతో విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ రావెల్లి రవి, ట్రెజరర్ లయన్ బుక్కాల శ్రీనివాస్, రీజన్ చైర్మన్ లయన్ డా. జైన రమేష్ పాల్గొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి, అవసరాలకు అండగా నిలవడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

You may also like...