సంజయ్‌నగర్ నూతన మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవాలి ; మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్

జనగామ, సెప్టెంబర్ 13: సంజయ్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన మార్కెట్‌ను వ్యాపారులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, కమిషనర్ చిమ్ముల రాజశేఖర్ రెడ్డి కోరారు. మార్కెట్‌ను సందర్శించి పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, లైటింగ్, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు. కూరగాయలు, పండ్లు, పూలు, వెజ్, నాన్‌వెజ్ వ్యాపారాలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వ్యాపారులు నూతన మార్కెట్‌కు తరలివచ్చి వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు. రోడ్లు, వీధుల్లో అనధికారికంగా వ్యాపారాలు నిర్వహిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

You may also like...