యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
- అంబులెన్స్ సేవల్లో నిర్లక్ష్యానికి భారీ జరిమానాలు! - October 18, 2026
- డీఎస్సీ–2008లో డీఈడీ అభ్యర్థులకు ఊరట.. 30% కోటాకు హైకోర్టు ఆమోదం - October 18, 2026
- నీటిని కాపాడుదాం.. కరువును ఎదురిద్దాం! - October 18, 2026

జ్ఞాన తెలంగాణ, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతంతో పాటు దసరా సెలవులు కొనసాగుతుండటంతో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.
స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తుల రాక పెరగడంతో దర్శన క్యూలైన్లు రద్దీగా మారాయి. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సెలవుల నేపథ్యంలో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో భక్తులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
