రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో కిస్మత్పూర్ విద్యార్థుల ఘన విజయం.

నల్గొండలోని శివాంజనేయ గార్డెన్స్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “షోటోకాన్ 11వ తెలంగాణ స్టేట్ కరాటే పోటీలు ఎస్.ఎస్. కరాటే & జిమ్నాస్టిక్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఛాంపియన్‌షిప్ – వారియర్స్ కప్ 2026” పోటీలలో కిస్మత్పూర్ కు చెందిన విద్యార్థులు విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఘన విజయం సాధించారు.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ను తొలగించాలని నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ ధర్నా

కల్వకుర్తి : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ప్రజల ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ…

నగారా బేరి లంబాడి హక్కుల జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్ నాయక్

నగార బేరి లంబాడి హక్కుల జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్ నాయక్నాగర్ కర్నూల్: నగారా బేరి లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు లెజెండ్ డాక్టర్ ధరావత్ గణేష్ నాయక్ న్యాయకత్వంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ నాయక్ ఏకగ్రీవంగా నియమించడం జరిగింది.నాయకులకు లంబాడి గిరిజన నాయకులకు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.గిరిజన నాయకులకు గిరిజన విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా వారికి అండగా…

వైద్య విద్యకు అండగా నిలిచిన ఉప్పల ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్

కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గంలోని వైద్య విద్యలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఇద్దరు నిరుపేద బిడ్డలు ఎంబిబిఎస్ లో సీటు సాధించిన తలకొండపల్లి మండలం,అంతరం గ్రామానికి చెందిన బొరిగే అరుణ్ కుమార్ మరియు కడ్తాల్ మండలం, మైసిగండి గ్రామానికి చెందిన గిరిజన ఆడబిడ్డ మల్లీశ్వరి నాయక్ లకు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్ తనవంతుగా ఒక్కరికి 15,000/- రూపాయల చొప్పున ఇద్దరు విద్యార్థులకు రూ.30 వేల రూపాయలు ఆర్థిక సహాయం…

కంకర పరిచారు.. తారు మరిచారు – ప్రమాదాలకు దారి చూపారు

వెల్దండ సెప్టెంబర్ 28:వెల్దండ మండలంలోని బైరా పూర్ నుండి కుందారం తండా కలకొండ గ్రామం వరకు 2023 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే గుర్క జయపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బీటీ రోడ్ మంజూరు కావడం జరిగింది. రోడ్డు నేటికి పూర్తి కావడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సగం రోడ్డు కంకర వేసి కాంట్రాక్టర్లు నిలిపివేయడం జరిగిదని,నిత్యం ఈ రహదారి ఉన్న వందలాదిమంది వాహనదారులు విద్యార్థులు, వృద్ధులు ప్రయాణిస్తూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి…

ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ గళం.. కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడి

ఓటు హక్కు పరిరక్షణ, పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పనను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ఆందోళనకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్ నాయకత్వం వహించారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ…

వైద్య విద్యలో సీటు సాధించిన విద్యార్థి సన్యాకు.. అండగా నిలిచిన గోలి శ్రీనివాస్ రెడ్డి

వెల్దండ : వెల్దండ మండలం చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన దువాసి అంజయ్యను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.వారి కుమార్తె దువాసి సన్యా ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా శాలువాతో సత్కరించి,చదువు కోసం రూ.10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. జిల్లా నాయకులు నాగులు నాయక్ సైతం రూ.5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో వెల్దండ మండల మాజీ ఎంపీపీ,బిఆర్ఎస్ పార్టీ…

మృతుడి కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం

వెల్దండ మండలం చౌదర్‌ పల్లి గ్రామ పంచాయతీకి చెందిన దండు రాములయ్య అనారోగ్యంతో మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తక్షణ ఆర్థిక సహాయంగా రూ.5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.అలాగే జిల్లా నాయకులు నాగులు నాయక్ గారు సైతం రూ.5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.కార్యక్రమంలో వెల్దండ మండల మాజీ ఎంపీపీ, పార్టీ మండల అధ్యక్షుడు పుట్ట…

శాంతియుతంగా వినాయక నిమజ్జనం.. సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో రెండు రోజుల పాటు నిర్వహించిన వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా విజయవంతంగా ముగిసిందని మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు, కాంగ్రెస్ యువ నాయకుడు కాసుల రోహిత్ తెలిపారు. నిమజ్జన కార్యక్రమానికి సహకరించిన పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండపాల నిర్వాహకులు, యువత, మహిళలు, భక్తులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, మీడియా ప్రతినిధులు అందించిన సహకారం అభినందనీయమన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జనం ప్రశాంతంగా ముగియడం అందరి…

అరుణోదయ విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతిక ప్రయాణంలో నవాబ్‌పేట్ వాసులు

అరుణోదయ విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతిక ప్రయాణంలో నవాబ్‌పేట్ వాసులువిమలక్క 50 సంవత్సరాల ప్రజా సాంస్కృతిక ప్రయాణాన్ని  పురస్కరించుకుని ఈ రోజు 50 గంటల పాటు భారీ ‘ప్రజా కళా జాతర’ను  ఆర్టీసీ క్రాస్ రోడ్డు నందు నిర్వహించారు  ఈ కార్యక్రమానికి నవాబ్ పేట్ మండలం నారె గూడెం గ్రామానికి చెందిన దళితరత్న అవార్డు గ్రహీత బి. శివరాజు అతని మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం వల్ల  విమలక్కను కలిసి ఆమె పాటలను వినడం…