శాంతియుతంగా వినాయక నిమజ్జనం.. సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో రెండు రోజుల పాటు నిర్వహించిన వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా విజయవంతంగా ముగిసిందని మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు, కాంగ్రెస్ యువ నాయకుడు కాసుల రోహిత్ తెలిపారు. నిమజ్జన కార్యక్రమానికి సహకరించిన పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండపాల నిర్వాహకులు, యువత, మహిళలు, భక్తులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, మీడియా ప్రతినిధులు అందించిన సహకారం అభినందనీయమన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జనం ప్రశాంతంగా ముగియడం అందరి సమష్టి కృషికి నిదర్శనమన్నారు. భక్తి, క్రమశిక్షణ, ఐక్యతతో పండుగను నిర్వహించిన బాన్సువాడ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...