రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో కిస్మత్పూర్ విద్యార్థుల ఘన విజయం.

285087.jpg

నల్గొండ:నల్గొండలోని శివాంజనేయ గార్డెన్స్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన "షోటోకాన్ 11వ తెలంగాణ స్టేట్ కరాటే పోటీలు ఎస్.ఎస్. కరాటే & జిమ్నాస్టిక్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఛాంపియన్‌షిప్ – వారియర్స్ కప్ 2026" పోటీలలో కిస్మత్పూర్ కు చెందిన విద్యార్థులు విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఘన విజయం సాధించారు. మాస్టర్స్ ఎమ్. హనుమంత్, కావలి రవి, మరియు ప్రేమ్ కుమార్ ల నేతృత్వంలో శిక్షణ పొందిన ఈ విద్యార్థులు వివిధ విభాగాల్లో పోరాడి పతకాల పంట పండించారు.

పతకాల పంట పండించిన క్రీడాకారులు మాస్టర్స్ ఎమ్. హనుమంత్, కావలి రవి, ప్రేమ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులు

బంగారు పతకాలు:- రేవంత్, ప్రజీత్ సాయి, సింధుజ, నవ్య శ్రీ, హరిణ్య, హితాన్సి, హర్జీత్, ఆరహ, విగ్నేష్, బి. విజయేందర్.ద్వితీయ స్థానం

వెండి పతకాలు:-ఎస్. నవ్య శ్రీ, ఈ. రమ్య.తృతీయ స్థానం

కంచు పతకాలు:- అంకిత, లోహిత్ రెడ్డి.

నాల్గవ స్థానం:అనన్య.ఈ సందర్భంగా మాస్టర్స్ ఎమ్. హనుమంత్, కావలి రవి, ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ. రాష్ట్ర స్థాయి పోటీలలో విద్యార్థులు చూపిన ప్రతిభ ఎంతో గర్వకారణమన్నారు. ప్రతిరోజూ క్రమశిక్షణతో కూడిన కఠినమైన శిక్షణ తీసుకోవడం వల్లే విద్యార్థులు ఈ స్థాయి పతకాలను సాధించగలిగారని కొనియాడారు. భవిష్యత్తులో వీరు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని దేశానికి, రాష్ట్రానికి మరిన్ని పతకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులను అకాడమీ నిర్వాహకులు, తోటి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఘనంగా అభినందించారు.

You may also like...