వైద్య విద్యలో సీటు సాధించిన విద్యార్థి సన్యాకు.. అండగా నిలిచిన గోలి శ్రీనివాస్ రెడ్డి

1001218706.jpg

వెల్దండ : వెల్దండ మండలం చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన దువాసి అంజయ్యను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.వారి కుమార్తె దువాసి సన్యా ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా శాలువాతో సత్కరించి,చదువు కోసం రూ.10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. జిల్లా నాయకులు నాగులు నాయక్ సైతం రూ.5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో వెల్దండ మండల మాజీ ఎంపీపీ,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పుట్ట రామ్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్,మాజీ అధ్యక్షులు జోగాయ్య,మాజీ ఉపసర్పంచ్ నిరంజన్,మాజీ ఎంపిటిసి జ్యోతి నిరంజన్,మాజీ సర్పంచ్ బాలు లక్ష్మయ్య,మాధవరెడ్డి,మాజీ సర్పంచ్ అంజి నాయక్,వెల్డండా మండల బీసీ సెల్ అధ్యక్షులు,మాజీ ఉప సర్పంచ్ నర్సింహా, ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగయ్య,ఉప సర్పంచ్ రాజు,సీనియర్ నాయకులు ప్రసాద్,వెంకటయ్య,పోలె అశోక్, వార్డు సభ్యులు సునీత ఆనంద్,పాషా,వెంకటయ్య,బాలరాజ్,మట్ట శ్రీనివాస్ గౌడ్ ఉప అధ్యక్షులు,రవి కుమార్,నర్సింహా,మహేష్,బాబురావు,బర్కం గణేష్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

You may also like...