గోవాకు సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు గోవాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘గోయ్‌ రాఖోన్న్‌ యాత్ర’లో ఆయన పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా సాయంత్రం జరిగే యాత్రలో పాల్గొని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కానున్నారు. గోవాలో పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ నేతలు, శ్రేణులు హాజరుకానున్నారు. యాత్రలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గోవా నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

You may also like...