తీన్మార్ మల్లన్న భారీ విజయానికి అంతా కృషి చేయాలి తెల్లం వెంకట్రావు
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

తీన్మార్ మల్లన్న భారీ విజయానికి అంతా కృషి చేయాలి తెల్లం వెంకట్రావు
- చర్ల మండల కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యేDr వెంకట్రావు గారి పిలుపు
- మార్పు ఆవశ్యకతను వివరిద్దాం: ఇన్ చార్జ్ తోట కూరా రవిశంకర్
జ్ఞాన తెలంగాణ /భద్రాద్రి/ చర్ల న్యూస్. మే 23:
ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు భారీ విజయాన్ని అందిద్దామని, ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా కృషి చేయాలని కాంగ్రెస్ భద్రాచలం ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. గురువారం చర్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల ఆత్మీయ సమావేశంలో ప్రసంగించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పట్టభద్రులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ప్రజా గొంతుకను చట్టసభలో వినిపించేందుకు తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ చేద్దామని అన్నారు. ప్రతి గ్రామంలో కమిటీగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పట్టభద్రుల ఓట్లు అభ్యర్థించాలని కోరారు.
పట్టభద్రుల వద్దకే మనం: రవిశంకర్.
గ్రామ గ్రామాన పట్టభద్రుల వద్దకు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాల్సిన ఆవశ్యకత వివరిద్దామని ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ చార్జ్ తోట కూరా రవిశంకర్ తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం, పట్టభద్రుల వాణి వినిపించేందుకు తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చర్ల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల విజయ భాస్కర్ రెడ్డి,సీనియర్ నాయకులు జవ్వాది రవి, చీమలమర్రి మురళి,కుమార్ రాజా, గుండేపూడి భాస్కర్, సతీష్, బండి వేణు, రాధాకృష్ణ,ఇర్ప శ్రీనివాస్, వరప్రసాద్,ex ఎంపీటీసీ మడకం పద్మ, అల్లం ఈశ్వర్, నాగరాజు, వినోద్, యలము రమేష్,రూంజా రాజా తదితరులు పాల్గొన్నారు.
