వెల్దండలో వైభవోపేతంగా విజయదశమి వేడుకలు
వెల్దండ, అక్టోబర్ 21:విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి వేడుకలను వెల్దండ మండల కేంద్రంతో పాటు గ్రామాలు,తండాల్లో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, మహిళలు బతుకమ్మ ఆడి చెరువుల్లో నిమజ్జనం చేశారు.ప్రజలు నూతన వస్త్రాలు ధరించి,డప్పుచప్పుళ్ల నడుమ గ్రామ పంచాయతీ నుంచి బీరప్పగడ్డ సమీపంలోని జమ్మిచెట్టు వద్దకు చేరుకున్నారు.సర్పంచ్ మట్ట యాదమ్మ, మట్ట వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో పురోహితుడు భాస్కర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం జమ్మిచెట్టును దర్శించుకుని, ఒకరికొకరు అలాయ్…
