Category: జిల్లా వార్తలు

భగత్ సింగ్ జయంతి

కామారెడ్డి జిల్లా లో సోమవారం ఎస్టి బాయ్స్ హాస్టల్ ఎల్లారెడ్డి నందు షహీద్ భగత్ సింగ్ గా పేరుగాంచిన ప్రఖ్యాత ఉద్యమకారుడు స్వాతంత్ర సమరయోధుడు 1907 సెప్టెంబర్ 28న జారన్వాలా తాసిల్ పైసాలాబాద్ జిల్లా పంజాబ్లో సిక్కు మతంలో పుట్టడం జరిగింది. కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు జన్మించిన భగత్ సింగ్ బ్రిటిష్ పాలన వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలు చేసినాడు. ఇట్టి కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ మెగావత్ కనీరామ్. అంబేద్కర్…

తండ్రి మరణంతో కోల్పోయిన పెద్ద దిక్కు.. రూ. 57 వేలితో అండగా నిలిచిన గ్రామస్తులు

వెల్దండ:కొట్ర గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన కొప్పు మాధవులు కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు. మాధవులకు ఇద్దరు చిన్నపిల్లలు ఉండటంతో వారి భవిష్యత్తు కోసం గ్రామస్తులందరూ కలిసి రూ.57 వేల నగదును సమకూర్చారు. ఈ మొత్తాన్ని ఆయన భార్య చైతన్య పేరుతో పోస్టాఫీసులో స్థిర నిక్షేపం చేశారు.ఈ సందర్భంగా మాధవులు కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన గ్రామస్తులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బి. మహేష్,9వ వార్డు సభ్యుడు కొప్పు మల్లేష్, ఎమ్మార్పీఎస్ గ్రామ…

కృష్ణ జింకల అక్రమ వేట – తొమ్మిది మంది అరెస్టు.!

నాగర్ కర్నూల్: కృష్ణ జింకల అక్రమ వేటకు సంబంధించిన కేసును షాద్‌నగర్ పోలీసులు,అటవీశాఖ అధికారులు కలిసి ఛేదించారు.ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సి.సిరిషా రాఘవేంద్ర, ఆర్‌ఆర్ జిల్లా డీఎఫ్‌ఓ శివ ఆశీష్ సింగ్ వెల్లడించారు. సెప్టెంబర్ 26న ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని,అతని సమాచారం మేరకు మిగతా నిందితులను సెప్టెంబర్ 27న పట్టుకున్నట్లు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణజింకలను వేటాడేందుకు నిందితులు ఆయుధాన్ని ఉపయోగించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి ఒక…

నాగర్ కర్నూల్ లో ప్రజావాణికి 51 ఫిర్యాదులు

నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 51 దరఖాస్తులు అందాయి. అదనపు కలెక్టర్ దేవ సహయం, ఏఓ చంద్రశేఖర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు తమ దరఖాస్తులను అధికారులకు అందజేశారు. సమస్యలను పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు.

అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు

అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులుమరో 12 రోజుల్లో తెలంగాణలోని విద్యార్థులకు దసరా హాలిడేస్ ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి తిరిగి అక్టోబర్ 22న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి అలాగే జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 10 నుంచి 21 వరకు సెలవులు ఇవ్వనున్నారు కాగా అక్టోబర్ 20న దసరా పండుగ జరగనుంది.

ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

తలకొండపల్లి మండలం విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం సెప్టెంబర్ 29న ఉదయం 11:45 నిమిషాలకు దేవకి గార్డెన్ లో నిర్వహించనున్న ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమానికి కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించనున్నారని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు,విద్యాశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,విద్యాభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

పర్వేద సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేత

పర్వేద సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలలో విద్యుత్  సరఫరా నిలిపివేతరేపు అనగా మంగళవారం తేదీ 29.09.2026 నాడు సబ్ స్టేషన్ లో మరమత్తులు చేయడం కోసం  ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పర్వేద సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలలో విద్యుత్  సరఫరా నిలిపి వేస్తున్నట్టు ఏఈ ప్రదీప్ కుమార్ తెలిపారు కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని మనవి.విద్యుత్ సరఫరా నిలిపివేసేప్రాంతాలు:పర్వేద,మసానిగూడ ,సంకేపల్లి , అంతప్పగూడ ,ఏర్వగూడ, కొత్తగూడ ,మంచగార్లగూడ, కచ్చిరెడ్డిగూడ…

రాచూర్ బీటి రోడ్డు నిర్మాణానికి ప్రజావాణిలో ఫిర్యాదు

వెల్దండ సెప్టెంబర్ 28: వెల్దండ మండల కేంద్రంలోని ఎంపీడీవో అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఒక్క ఫిర్యాదు అందినట్లు ఎంపీడీవో సులోచన తెలిపారు.మండల కేంద్రం నుండి రాచూర్ గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణాని కై పలుమార్లు అధికారులకు దరఖాస్తులు అందజేసి పాదయాత్రలు చేపట్టిన రోడ్డు పనులు చేపట్టకపోవడం బాధాకరమంటూ వినతిలో పేర్కొన్నట్టు వార్డు సభ్యులు సురేష్ రెడ్డి, కొంగళ్ళ స్వాతి శివశంకర్ తెలిపారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను తీసుకోకుండా తిప్పి పంపుతున్నారని…

SIRపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన

SIRపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ
నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన