అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు

తెలంగాణలో విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న దసరా సెలవులు సమీపిస్తున్నాయి. అక్టోబర్‌ 10వ తేదీ నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 21 వరకు సెలవులు కొనసాగి, అక్టోబర్‌ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులకు వరుసగా సెలవులు రావడంతో పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారనుంది. మరోవైపు రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలకు కూడా అక్టోబర్‌ 10 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అక్టోబర్‌ 20న దసరా పండుగ జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు, కుటుంబాలు పండుగ ఏర్పాట్లలో నిమగ్నం కానున్నారు. సెలవుల నేపథ్యంలో విద్యార్థులు స్వగ్రామాలకు వెళ్లేందుకు, బంధువులను కలుసుకునేందుకు అవకాశం లభించనుంది.

You may also like...