కృష్ణ జింకల అక్రమ వేట – తొమ్మిది మంది అరెస్టు.!

నాగర్ కర్నూల్: కృష్ణ జింకల అక్రమ వేటకు సంబంధించిన కేసును షాద్‌నగర్ పోలీసులు,అటవీశాఖ అధికారులు కలిసి ఛేదించారు.ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సి.సిరిషా రాఘవేంద్ర, ఆర్‌ఆర్ జిల్లా డీఎఫ్‌ఓ శివ ఆశీష్ సింగ్ వెల్లడించారు. సెప్టెంబర్ 26న ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని,అతని సమాచారం మేరకు మిగతా నిందితులను సెప్టెంబర్ 27న పట్టుకున్నట్లు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణజింకలను వేటాడేందుకు నిందితులు ఆయుధాన్ని ఉపయోగించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి ఒక తుపాకీ, 19 తూటాలు,నగదు రూ.28,590 తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.ఈ దర్యాప్తులో షాద్‌నగర్ పోలీసులు,ఎస్‌ఓటీ పోలీసులు, అటవీశాఖ అధికారులు, యాంటీ పోచింగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.కృష్ణజింకలు, ఇతర వన్యప్రాణులను వేటాడటం చట్టరీత్యా నేరమని,వన్యప్రాణుల సంరక్షణకు ప్రజలు సహకరించాలని అధికారులు సూచించారు.వన్యప్రాణుల అక్రమ వేటకు సంబంధించిన సమాచారం ఉంటే అటవీశాఖకు తెలియజేయాలని కోరారు.సమాచారం ఇచ్చిన వ్యక్తు ల పేర్లు గోప్యంగా ఉంచుతాము అనీ తెలిపారు.1001219500.jpg

You may also like...