సింగరాజుపల్లిలో శ్రీ స్వాతి ఎలక్ట్రికల్ షాపు ప్రారంభం

దేవరుప్పుల: మండలంలోని సింగరాజుపల్లి గ్రామ ప్రధాన రహదారిపై ధరావత్ తండా మాజీ సర్పంచ్ భానోత్ గేమా నాయక్ ఏర్పాటు చేసిన శ్రీ స్వాతి ఎలక్ట్రికల్ హార్డ్వేర్ అండ్ వైన్డింగ్ షాపును ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు అవసరమైన ఎలక్ట్రికల్, హార్డ్వేర్ సామగ్రి అందుబాటులో ఉండేలా షాపు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వ్యాపారం అభివృద్ధి చెందాలని, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి, మండల అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్, ఏల సుందర్, వంగ అర్జున్, యూత్ అధ్యక్షుడు నవీన్ నాయక్, గ్రామస్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.1012843188.jpg

You may also like...