ప్రజావాణి అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యత

జనగామ జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్‌షాలోంతో కలిసి ప్రజల నుంచి 481 దరఖాస్తులు స్వీకరించారు. ప్రజలు సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజావాణిలో ఇందిరమ్మ ఇళ్లు, రహదారి కబ్జా, భూ పట్టాలు, భూసర్వే, ఇళ్ల మంజూరు తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో బలరామరావు, డీఆర్డీఓ భాస్కర్, సీపీఓ చినకోట్యా నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

You may also like...