రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్ డివిజన్ 276 పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సుమారు రూ.60 లక్షల వ్యయంతో చేపట్టనున్న పార్క్ అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు చిన్నారులు, వృద్ధులకు పార్కులు ఎంతో అవసరమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కొలన్ శ్రీనివాస్ రెడ్డి, చిట్ల దివాకర్, రాజిరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
