ప్రముఖుల అభినందనల మధ్య ఘనంగా ఎన్‌వీ ఇల్యూమినేషన్ ప్రారంభోత్సవం

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ రాణిగంజ్‌లో ఎన్‌వీ ఇల్యూమినేషన్ (NV Illumination) ఎల్‌ఈడీ అవుట్‌డోర్ లైటింగ్ సంస్థ ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఉపసభాపతి, ఎమ్మెల్యే టీ. పద్మారావు గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హాజరై సంస్థను ప్రారంభించి, మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ హజ్నాలేకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మౌనిక సుంకర, రమేష్ కుమార్, గిరివర్ధన్ రెడ్డి, ఎం. రఘునాథ్ యాదవ్, పి. హర్షవర్ధన్ రావు, కంసెట్టి హజ్నాలే, వ్యాపార ప్రముఖులు నిరవ్ షా, జయేష్ జైన్, ఆకాష్ సంఘ్వి, పులి బలరాం, నల్ల జై శంకర్ గౌడ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ ద్వారా నాణ్యమైన ఎల్‌ఈడీ అవుట్‌డోర్ లైటింగ్ సేవలు అందిస్తూ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని జగదీష్ హజ్నాలే ఆకాంక్షించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...