జహీరాబాద్ బస్టాండ్ వద్ద ఘనంగా దీక్షా దివస్ వేడుకలు..కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఆదివారం జహీరాబాద్ పట్టణ బస్టాండ్ వద్ద ‘దీక్షా దివస్’ వేడుకలను ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అమరవీరులకు నివాళులర్పించి, అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ.. “నవంబర్ 29 తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ నినాదంతో ఆయన చేసిన పోరాటం ఢిల్లీని కదిలించి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిపెట్టింది. ఇదే స్ఫూర్తితో తెలంగాణ హక్కుల పరిరక్షణకు, సబ్బండ వర్గాల అభివృద్ధికి కలిసి నడుద్దాం” అని పిలుపునిచ్చారు.
​కార్యక్రమంలో మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, సంజీవ్ రెడ్డి, నర్సింలు, పీఏసీఎస్ చైర్మన్ స్రవంతి అరవింద్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తంజిం, సీనియర్ నాయకులు నామా రవికిరణ్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్వీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

You may also like...