బాల్య వివాహాల నిర్మూలన, విద్య హక్కుల పరిరక్షణపై అవగాహన తాడ్వాయి గురుకులంలో ప్రత్యేక కార్యక్రమం
- బాల్య వివాహాల నిర్మూలన, విద్య హక్కుల పరిరక్షణపై అవగాహన తాడ్వాయి గురుకులంలో ప్రత్యేక కార్యక్రమం - November 28, 2026
- మైనార్టీ గురుకుల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి - November 27, 2026
- కుల వివక్షకు తావులేకుండా సామాజిక న్యాయం కల్పించాలి – అంబేద్కర్ సంఘం జిల్లా కమిటీ - November 27, 2026
తాడ్వాయి: బాల్య, ముందస్తు మరియు బలవంతపు వివాహాల నిర్మూలన లక్ష్యంగా కామారెడ్డి జిల్లా తాడ్వాయి TGSWRS JC (G) గురుకుల కళాశాలలో అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ బి. సురేఖ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి శ్రావంతి, తాడ్వాయి MRO శ్వేత, న్యాయవాది నవీన్, సాధన NGO జిల్లా కో-ఆర్డినేటర్ గిరిజ, AHTU అధికారి రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును దెబ్బతీయడంతో పాటు వారి ఆరోగ్యం, విద్య, స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. బాల్య వివాహ నిషేధ చట్టం, బాలల హక్కులు, POCSO చట్టం, చట్టపరమైన శిక్షలు, ఉచిత న్యాయ సహాయం, సఖి కేంద్రం సేవల గురించి వివరించారు. బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్లైన్కు సమాచారం అందించాలని సూచించారు. అలాగే మానవ అక్రమ రవాణా, మహిళలు మరియు బాలికల రక్షణ, బాలికల ఉన్నత విద్య, స్వావలంబన ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. విద్యార్థినులు అడిగిన సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినులందరూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నిలబడాలని, బాలికల విద్యకు ప్రాధాన్యతనిస్తూ సమాజంలో అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం చివరలో ప్రిన్సిపాల్ బి. సురేఖ అతిథులకు, సిబ్బందికి, విద్యార్థినులకు కృతజ్ఞతలు తెలిపారు.
