విద్యావ్యాప్తికి జీవితాన్ని అంకితం చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే

విద్యావ్యాప్తికి జీవితాన్ని అంకితం చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే 

మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పరిగి పట్టణంలో ఆయన విగ్రహానికి బిఆర్ఎస్ నేతలు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో సామాజిక విప్లవ పితామహుడిగా పేరుగాంచి,అంటరనితనం కులవివక్షపై పోరాటం మరియు మహిళా విద్య వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం వారి విద్యాభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబాపూలే అని విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన పూలే ముందుగా తన భార్య సావిత్రి భాయికి చదువు నేర్పించారని అనంతరం భారతదేశంలోనే మొదటి బాలికల పాఠశాలను పూణే ప్రాంతంలో ఆయన ప్రారంభించారని అన్నారు మరెన్నో రచనలు సామాజిక సంస్కరణలు చేసి ఒక సామాజిక విప్లవ పితామహుడిగా పేరుగాంచారని ఆయనను కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరవింద్ రావు మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుందా అశోక్ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి కౌన్సిలర్స్
శ్రీనివాస్ రవి కుమార్ నరేష్ మాజీ కౌన్సిలర్ మునీర్ నాయకులు అనేం ఆంజనేయులు బాలల తాహెర్ అలీ శేఖర్ ఆసిఫ్ ఏక్బాల్ బిఆర్ఎస్వి సాయి పృద్వి సందీప్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు

You may also like...