దీక్షా దివస్‌కు తరలిరావాలి: మోరల్ శ్రీనివాసరావు పిలుపు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నేత కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన అమరణ నిరాహార దీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని బాన్సువాడ నియోజకవర్గ వ్యాపారవేత్త మోరల్ శ్రీనివాసరావు అన్నారు. “తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో” అనే నినాదంతో ప్రారంభమైన ఆ మహోన్నత పోరాటం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బలమైన పునాది వేసిందని పేర్కొన్నారు.నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను, అమరుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. “మా గళం.. మా బలం.. మా బలగం కేసీఆర్ సార్” అంటూ తెలంగాణ ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని చాటుదామని అన్నారు.బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మోరల్ శ్రీనివాసరావు కోరారు.

You may also like...