దీక్షా దివస్ ఏర్పాట్లను పరిశీలించిన ఎర్రబెల్లి
- ఉపాధి హామీ నిధుల చెల్లింపుల్లో అక్రమాలు - November 28, 2026
- కొత్త పెన్షన్లపై కాంగ్రెస్ సంబరాలు - November 28, 2026
- దీక్షా దివస్ ఏర్పాట్లను పరిశీలించిన ఎర్రబెల్లి - November 28, 2026

పాలకుర్తి: నవంబర్ 29న నిర్వహించనున్న బీఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం పాలకుర్తి చౌరస్తాలో కార్యక్రమ స్థలాన్ని పార్టీ మండల నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు, స్థల ఎంపికపై నాయకులతో చర్చించి, పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
