జిల్లా గ్రంథాలయంలో పారిశుద్ధ్య లోపాలు పిచ్చి మొక్కలు, దోమలతో విద్యార్థుల ఇబ్బందులు.
జనగామ జిల్లా కేంద్ర గ్రంథాలయం పరిసరాలు పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుద్ధ్య లోపాలతో దోమలు, ఇతర కీటకాలు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు దోమల నివారణకు ఫాగింగ్, మందు పిచికారీ చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.
