సర్పంచ్‌పై కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు.. రూ.30 వేల పన్ను సొమ్ము దుర్వినియోగంపై విచారణకు ఆదేశాలు

తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామానికి చెందిన కల్లు దుకాణం నుంచి వసూలు చేసిన రూ.30 వేల సర్పంచ్ పన్ను మొత్తాన్ని ట్రెజరీ ఖాతాలో జమ చేయకుండా, మూడు నెలల పాటు సొంత అవసరాలకు వినియోగించుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామసభలో ఈ విషయంపై ప్రశ్నించగా, ఆ నగదు తన వద్దే ఉందని, ట్రెజరీ ఖాతాలో జమ చేయలేదని సర్పంచ్ అంగీకరించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ వ్యవహారంపై సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పన్ను సొమ్ము వినియోగంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన కలెక్టర్ వెంటనే విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉపసర్పంచ్ గైని శివాజీ, గంట బాలరాజ్, ఎండీ ఫారూఖ్, ఎండీ హమీద్, గడ్డం లింగం, రవి, శేఖర్, భరత్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.

You may also like...