భారతీయ విద్యార్థి మోర్చా కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా రోహిత్, కో-కన్వీనర్‌గా భానుప్రసాద్ నియామకం
- భారతీయ విద్యార్థి మోర్చా కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా రోహిత్, కో-కన్వీనర్‌గా భానుప్రసాద్ నియామకం - November 8, 2026
- పెళ్లి పత్రికలు పంచేందుకు వచ్చిన యువతి హత్య.. గాంధారిలో కలకలం! - November 8, 2026
- ఆడబిడ్డల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా.. సుకన్య సమృద్ధి యోజనకు చేయూత - November 6, 2026
కామారెడ్డి: బాంసెఫ్ అనుబంధ విద్యార్థి సంఘమైన భారతీయ విద్యార్థి మోర్చా (BVM) కామారెడ్డి జిల్లా నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షులు భూంపల్లి రవితేజ ఆధ్వర్యంలో ప్రకటించారు. బాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షులు దుబాసి నరేందర్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు, జిల్లా అధ్యక్షులు గంగారం సమక్షంలో నియామకాలు చేపట్టారు. జిల్లా కన్వీనర్‌గా రోహిత్, కో-కన్వీనర్‌గా భానుప్రసాద్‌ను నియమించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. “నా చదువు – నా సమాజం కోసం” అనే నినాదంతో విద్యార్థుల్లో సామాజిక చైతన్యం పెంపొందిస్తూ, పూలే, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ విద్యార్థుల హక్కుల కోసం బీవీఎం పోరాడుతోందన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన రోహిత్, భానుప్రసాద్ నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సతీష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
