కట్టంగూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ శరత్ చంద్ర ప్రవార్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 23 : కట్టంగూర్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్టేషన్ లోని వివిధ రికార్డులు, పరిసరాలను పరిశీలించి మండలంలో శాంతి భద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, పోలీసుల పనితీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారు తమ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు సత్వరమే స్పందించి పరిష్కరించాలని సూచించారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపటాటలని, రహదారి భద్రతపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో నేరాలు జరగకుండా నిఘా ఏర్పాటు చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణలో సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. తనిఖీలో డీఎస్పీ శిరాంరెడ్డి, సీఐలు రాజశేఖర్, హరిబాబు, ఎస్ఐలు క్రాంతి కుమార్, రవికుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

You may also like...