వినాయక ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదు

వినాయక ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదు

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఎస్‌ఐ మునుగోటి రవీందర్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 8 : వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని కట్టంగూర్ ఎస్‌ఐ మునుగోటి రవీందర్ సూచించారు. మంగళవారం పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక మండపాలు, నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, అధిక శబ్దంతో కూడిన లౌడ్‌స్పీకర్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. స్పీకర్లను నిబంధనలకు అనుగుణంగా తక్కువ శబ్దంతో రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని, ఊరేగింపుల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. అలాగే సోషల్‌ మీడియాలో ఇతర మతాల మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు, వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. వినాయక ఉత్సవాలను అందరూ సమన్వయంతో ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ రవీందర్ కోరారు.1000338115.jpg

You may also like...