రిపోర్టర్, నల్గొండ | 7702665844
Latest posts by Gandamalla Kishan
(see all) గ్రామపంచాయతీ కార్మికులకు దుస్తుల పంపిణీ
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 3 : వృద్ధాప్య దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో, లయన్ గుడిపాటి శివప్రసాద్–పద్మ దంపతుల సహకారంతో శనివారం గ్రామపంచాయతీ కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని అన్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం పనిచేస్తున్న కార్మికులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్మికులకు దుస్తులు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు.కార్యక్రమంలో క్లబ్ అడ్వైజర్ లయన్ రెడ్డిపల్లి సాగర్, సెక్రటరీ లయన్ మంగ దుడ్ల శ్రీనివాస్, కోశాధికారి కల్లూరి వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, బొడ్డుపల్లి వెంకన్న, చిట్టిప్రోలు రామకృష్ణ, సోమేశ్, జిల్లా అశోక్, మన్నెం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
