చీమలదరి లో ఉచిత వైద్య శిబిరం

మోమిన్ పేట్ మండలం చీమలదరి గ్రామంలో అపోలో మెడికల్ కాలేజ్ హాస్పిటల్  వారు జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీమలదరి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో సాధారణ వ్యాధుల వైద్య సేవలు మరియు సాధారణ శస్త్ర చికిత్సల వైద్యులు , ఎముకల వ్యాధుల వైద్యులు, మరియు కంటి వ్యాధుల వైద్యులు పాల్గొనడం జరిగింది ఈ క్యాంపులో 350 మందికి పైగా గ్రామస్తులు  పాల్గొనడం జరిగింది ఇట్టి క్యాంపులో  ఉచితంగా బిపి షుగర్ వైద్య పరీక్షలు ఉచితంగా చేయడం తో  మరియు మందులు  ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరం వల్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు .

You may also like...