షాపల్లిలో దేవుని మాన్యం భూమికి హద్దులు ఏర్పాటు చేయాలి

1000203894.jpg

జాఫర్‌ఘడ్‌ మండలం షాపల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 54లో హనుమాన్‌ దేవాలయానికి చెందిన మూడు ఎకరాల భూమిని దేవుని మాన్యంగా గుర్తించి, హద్దులు ఏర్పాటు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్‌ గౌడ్‌ కోరారు. అలాగే సర్వే నంబర్‌ 135లోని 2 ఎకరాల 24 గుంటల ఈనాం భూమికి సంబంధించిన పాత రికార్డులను పరిశీలించి, నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీకి చెందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బీజేపీ జాఫర్‌ఘడ్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మన్‌ కీ బాత్‌ మండల కన్వీనర్‌, షాపల్లి బీజేపీ నాయకుడు ఏడెల్లి కార్తీక్‌ పాల్గొన్నారు.

You may also like...