బతుకమ్మలతో పాఠశాలల విద్యార్థినులు
- బతుకమ్మలతో పాఠశాలల విద్యార్థినులు - October 9, 2026
- వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు తగిన సూచనలు - October 7, 2026
- చంద్రయాన్ పల్లి లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - October 7, 2026
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండగ బతుకమ్మ .పువ్వులను ఆరాధించడం ఒక విలక్షణ సంస్కృతిగా మన తెలంగాణలో కనిపిస్తుంది మహిళల ఆత్మీయ, ప్రకృతి ప్రేమ, భక్తి, సాంస్కృతిక వైవిధ్యాన్ని బతుకమ్మ చాటుతుంది.పాఠశాలలకు దసరా సెలవులు ఇచ్చే తరుణంలో విద్యార్థినులు ఉదయం పాఠశాలకు వెళ్లే సమయంలో అక్కడక్కడ బస్ స్టాప్ లలో, పాఠశాలలకు వెళ్లే దారులలో బతుకమ్మలతో సంప్రదాయ దుస్తులలో చిన్నారులు రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో కనిపించారు పాఠశాలలకు చివరి రోజు కావడంవల్ల బతుకమ్మ వేడుకలు జరుపుకోనున్నారు . ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులకు బతుకమ్మ విశిష్టత గురించి ఈ వేడుకల ద్వారా తెలియజేయడం జరుగుతుంది

