జనగామలో మానవత్వం చాటిన ట్రాఫిక్ పోలీసులు

జనగామ పట్టణంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు మానవత్వం చాటారు. భువనగిరికి చెందిన ఓ మహిళ దారి తప్పి, ఆకలితో ఇబ్బందులు పడుతుండగా ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వచ్చింది.వెంటనే పోలీసులు ఆమెను గుర్తించి, వివరాలు తెలుసుకున్నారు. ఆమెకు ఆహారం అందించి, సురక్షితంగా ఇంటికి చేరుకునేలా సహాయం చేశారు. పోలీసుల మానవతా దృక్పథాన్ని పలువురు అభినందించారు.

You may also like...