పోగొట్టుకున్న 67 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసిన జనగామ పోలీసులు
- పోగొట్టుకున్న 67 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసిన జనగామ పోలీసులు - October 8, 2026
- రాజ్‌ఘాట్ వైపు ఇండీ కూటమి నేతలు - October 8, 2026
- రాజ్‌ఘాట్ వద్ద ఇండియా కూటమి నేతల నిరసన - October 8, 2026

- డిసిపి రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో అందజేత
జ్ఞాన తెలంగాణ,జనగామ ప్రతినిధి,అక్టోబర్ 8:
పోగొట్టుకున్న 67 మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసిన జనగామ పోలీసులు వాటిని సంబంధిత బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ పోయిన వెంటనే బాధితులు ధైర్యం కోల్పోకుండా CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన వెంటనే CEIRలో IMEI వివరాలు నమోదు చేస్తే ఫోన్‌ను బ్లాక్ చేయడంతో పాటు తిరిగి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. కంప్యూటర్ పరిజ్ఞానం లేని వారు సంబంధిత పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని, ప్రతి పోలీస్ స్టేషన్లో CEIR పోర్టల్ బాధ్యతాధికారిని నియమించినట్లు చెప్పారు.సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని,అనుమానాస్పద ఫోన్లను కొనుగోలు చేయవద్దని సూచించారు. మొబైల్ ఫోన్ల రికవరీలో కృషి చేసిన పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు.CEIRలో నమోదు విధానం: పోయిన ఫోన్లో ఉపయోగించిన SIMను తిరిగి యాక్టివేట్ చేసుకుని, మీ సేవా కేంద్రం/పోలీస్ స్టేషన్లో Missing Articles కింద నమోదు చేయాలి. అనంతరం CEIR పోర్టల్‌లో మొబైల్ IMEI వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి.CEIR పోర్టల్www.ceir.gov.in
