మట్టి వినాయకుడిని పూజిద్దాం – పర్యావరణం కాపాడుదాం: గోలి శ్రీనివాస్ రెడ్డి
- మట్టి వినాయకుడిని పూజిద్దాం – పర్యావరణం కాపాడుదాం: గోలి శ్రీనివాస్ రెడ్డి - September 13, 2026
- చొక్కన్నపల్లి మాదిగల మానవతా సహాయం రూ. 28500/-అందజేత - September 13, 2026
- మట్టి గణపతులకు పట్టం – లోగోను ఆవిష్కరించిన సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ - September 13, 2026
కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.వినాయక చవితి పవిత్రమైన పండుగ అని, భక్తితో పాటు బాధ్యత కూడా అవసరమన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగుల విగ్రహాల వల్ల చెరువులు, కుంటలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈసారి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే పూజించాలని, సహజ రంగుల విగ్రహాలను ప్రోత్సహించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. కల్వకుర్తిలోని చెరువులు, కుంటలు మన జీవనాధారమని, వాటిని కాపాడుకోవడం మన బాధ్యతని అన్నారు.యువత, మహిళలు, రైతులు అందరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ వినాయక చవితిని పర్యావరణహితంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
