Daily Archive: November 21, 2026

శ్రీరామ్ మరియు ఎన్టీఆర్ నగర్ సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

గాజులరామారం: మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా గాజులరామారం సర్కిల్‌ రోడ్‌ మేస్త్రీనగర్‌ డివిజన్‌ పరిధిలోని శ్రీరాంనగర్‌, ఎన్టీఆర్‌ నగర్‌లలో రూ.1.25 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి, సంక్షేమం నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 6,600 చేయూత పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. ప్రభుత్వ భూముల విక్రయాలపై బీఆర్‌ఎస్‌ నాయకులపై ఆరోపణలు చేశారు. కార్యక్రమంలో…

బైక్ దగ్ధం

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి కాకలగుట్ట తండా గ్రామ శివారులో శనివారం ఘటన జరిగింది. గ్రామానికి చెందిన భూక్య గణేష్కు చెందిన ఎట్రిక్ ద్విచక్ర వాహనం షార్ట్‌లక్‌తో దగ్ధమైంది. కూరగాయలు అమ్మేందుకు వెళ్తుండగా వాహనం నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో అప్రమత్తమైన భూక్య గణేష్ పక్కకు తప్పుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో బ్యాటరీ వాహనం పూర్తిగా దగ్ధమైంది.

రోడ్డు ప్రమా

రోడ్డు ప్రమాదం.. దంపతులకు గాయాలుకామారెడ్డి జిల్లా బిక్కనూర్ సమీపంలోని లక్ష్మీనగర్ తండా జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. టీవీఎస్ ఎక్సెల్పై కామారెడ్డి వైపు వెళ్తున్న దంపతులను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరి తీవ్ర గాయాలు. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఇందిరమ్మ ఇళ్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సూచనలుకామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం సర్పంచ్ సుధారాణి బాపురెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో నిర్మించుకోవాలని తెలిపారు. శనివారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ముగ్గు పోశారు. అనంతరం లబ్ధిదారులకు దరఖాస్తు పత్రాలు. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని, ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

కల్తీ కల్లుప

కామారెడ్డిలో కల్తీ కల్లుపై ఎక్సైజ్ శాఖ తనిఖీలుకామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు విక్రయాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని 2వ కల్లు డిపోతోపాటు దేవునిపల్లిలోని కల్లు దుకాణాల్లో ఎక్సైజ్ శాఖ సిఐ పోశెట్టి తనిఖీలు చేపట్టి, కల్లు నమూనాలను సేకరించి పరీక్షల కోసం తీసుకెళ్లారు. నమూనాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

చెక్కుల పంపి

వధూవరులకు రూ.2.50 లక్షల చెక్కుల పంపిణీకామారెడ్డి జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న వధూవరులకు ప్రభుత్వం ఆర్థిక రూ.2.50 లక్షల సహాయానికి సంబంధించిన చెక్కులను నేడు కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని, నూతన దంపతులు సంతోషంగా జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.

వైభవంగా తులసి దామోదర కళ్యాణం వార్షిక ఏకాదశి పూర్ణాహుతి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూరు నవంబర్ 21 : పవిత్ర కార్తీక మాసం సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీశ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో తులసి కళ్యాణం, కార్తీక దామోదర పూజా, వార్షిక ఏకాదశి మహా యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. గత ఏడాది కాలంగా నిర్వహిస్తున్న తృతీయ వార్షిక ఏకాదశి హోమం పూర్ణాహుతి ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ పూజారి రామడుగు శ్రీనివాస శర్మ, రామడుగు అశ్విన్ శర్మ ఆధ్వర్యంలో తులసి కళ్యాణం, కార్తీక దామోదర పూజలలో…

ఎమ్మెల్యే వీరేశంపై విమర్శలు సహించేది లేదు : కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 21: ఎమ్మెల్యే వేముల వీరేశంపై మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ నాయకుడు సుంకరబోయిన నర్సింహ్మ పదేపదే విమర్శలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య హెచ్చరించారు. పార్టీకి ఎవరు ద్రోహం చేశారో, గతంలో ఎన్నిసార్లు వెన్నుపోటు పొడిచారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కట్టంగూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన…

లింగంపేట్ టీఆర్ఎస్‌లో ఇద్దరికి కీలక పదవులు

లింగంపేట్ మండల టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఎల్లారెడ్డి నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఇద్దరు నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఐలాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు సాయిలును లింగంపేట్ మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా, పోతాయిపల్లి గ్రామానికి చెందిన రాపర్తి మహేందర్‌ను మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ నియామకాలను మండల అధ్యక్షుడు పోకల సాయిరాం వెల్లడించారు. ఈ సందర్భంగా రాపర్తి మహేందర్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల…

పేదరికాన్ని జయించి హైకోర్టు న్యాయవాదిగా భూంపల్లి రవితేజ

ఎర్రపహాడ్ గ్రామం నుంచి ఉన్నత న్యాయస్థానం వరకు.. పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకున్న విద్యార్థి నాయకుడుపేదరికం చదువుకు అడ్డంకి కాదని, కష్టపడే తత్వం, పట్టుదల, స్పష్టమైన లక్ష్యం ఉంటే ఎన్ని అవరోధాలనైనా అధిగమించి ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని విద్యార్థి నాయకుడు భూంపల్లి రవితేజ నిరూపించారు. రైతు కుటుంబంలో జన్మించి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ విద్యాభ్యాసాన్ని కొనసాగించిన ఆయన హైకోర్టు న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేయడం గ్రామానికి, కుటుంబానికి గర్వకారణంగా నిలిచింది.తెలంగాణలోని కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్…