Daily Archive: September 27, 2026
వెల్దండ: మండల కేంద్రంలోని పాత ఎస్‌బీఐ బ్యాంకు భవనంలో ఎస్.వీ. ప్రజా వైద్యశాల ఆదివారం ప్రారంభమైంది. ఎన్నమ్స్ అధినేత డాక్టర్ హరికాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్నం భూపతిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.అనంతరం ఆసుపత్రి యాజమాన్యం అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన…
70వ ఎస్ జి ఎఫ్ జిల్లా స్థాయి క్రీడల్లో కోల్కొంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా స్థాయి క్రీడల్లో కబడ్డీ విభాగంలో ప్రథమ స్థానం లో ట్రోఫీ సాధించగా, ఖో ఖో,వాలీబాల్ విభాగంలో రన్నరప్ గా ట్రోఫీ సాధించారు. పాఠశాల పిఈటి వీరేందర్ అందించిన ప్రత్యేక శిక్షణ, వల్ల ఈ ట్రోఫీ సాధ్యమైందని పాఠశాల ప్రిన్సిపాల్ అన్నారు ఉపాధ్యాయులు, స్థానికులు పాఠశాల విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.
వెల్దండ: మండలంలోని అన్ని గ్రామాల్లో ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో భాగంగా ఉల్లాస్ శిక్షణ ద్వారా మహిళా సంఘాల సభ్యులకు కనీస అక్షర పరిజ్ఞానం పెంపొందించేందుకు ఆదివారం ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమాన్ని సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళలు విద్యను అభ్యసిస్తే కుటుంబంతో పాటు సమాజంలోనూ వెలుగులు నింపుతారని అన్నారు. కార్యక్రమంలో డీపీఎం శ్రీనివాస్, ఏపీఎంలు జయమాలిని, సంతోష్‌కుమార్, వార్డు సభ్యులు పురుషోత్తం చారి,…
వెంచర్ నిర్వాహకులకు అధికారుల అండదండలు ఉన్నాయా?
మన్సాన్పల్లి శివారులో వ్యవహారంపై కలెక్టర్ జోక్యం కోరుతున్న స్థానికులు
ఘనంగా లిటిల్ స్టార్ స్కూల్ ఉపాధ్యాయులు ఆనంద్ జన్మదిన వేడుకలుప్రముఖ విద్యావంతుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మిత్రులుపత్రికా ప్రకటన / వార్తా నివేదిక:లిటిల్ స్టార్ స్కూల్ ఉపాధ్యాయులు ఆనంద్ జన్మదిన వేడుకలు వివిధ ర రంగాల ప్రముఖులు, విద్యావంతులు మరియు స్నేహితుల సమక్షంలో అత్యంత వేడుకగా, ఘనంగా జరిగాయి.ఈ వేడుకల్లో లిటిల్ స్టార్ ప్రధాన ఉపాధ్యాయులు సంజు, వాసవి ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డి. రామచందర్, చైతన్య జూనియర్ కళాశాల తెలుగు…
శ్రీ తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి గారి ప్రోత్సాహం మరియు సహకారంతో యువ పర్వతారోహకుడు విస్లావత్ బన్నీ, ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ బృందం హిమాచల్ ప్రదేశ్‌లోని మియార్ లోయలో 6,027 మీటర్ల ఎత్తైన మౌంట్ తరంగ్-2 శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి అరుదైన ఘనతను సాధించారు. ఇప్పటికే పలు పర్వత శిఖరాలను అధిరోహించిన విస్లావత్ బన్నీ, ఈ ప్రతిష్టాత్మక యాత్రలోనూ తన సాహస ప్రతిభను చాటుకున్నారు. యువతలోని ప్రతిభను గుర్తించి, వారి కలలను సాకారం చేసుకునే క్రమంలో అవసరమైన ప్రోత్సాహం మరియు…
కల్వకుర్తి : కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ గ్రామానికి చెందిన కాటన్ మిల్లు కార్మికురాలు నిర్మలా ఇంటి నిర్మాణం ఆర్థిక ఇబ్బందుల వల్ల మద్యలో నిలిచిపోయింది.ఈ విషయాన్ని కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్య ప్రకాష్ రావు ద్వారా తెలుసుకుని ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్,బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో నిర్మలా ఇంటికి సిమెంటును అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ…
అనంతగిరి కొండల్లో కొలువైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి 500ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడి శివలింగం కింద నుంచి ఏడాది పొడవునా సహజ భూగర్భ జలధార ప్రవహిస్తూ కోనేట్లోకి చేరుతుంది. మూసీ నది జన్మస్థాన పరిధిలో ఉన్న ఈ క్షేత్రం ఆధ్యాత్మికత, ప్రకృతి కలయికకు నిదర్శనం. మహా శివరాత్రికి భక్తులు పోటెత్తే ఈ ఆలయం పర్యాటక దినోత్సవం సందర్భంగా సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
నాగర్ కర్నూల్ :ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే వీర హర్షవర్ధన్ రెడ్డి తండ్రి స్వర్గీయ బీరం లక్ష్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సెప్టెంబర్ 27 ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు లక్ష్మారెడ్డి దశదినకర్మకు హాజరవుతున్నారని పార్టీ నాయకులు తెలిపారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనగలరని నాయకులు తెలిపారు.
లింగారెడ్డి పల్లి గ్రామంలో ఐనాల బక్కమ్మ గారు మరణించగా, వారి కుటుంబాన్ని మైల నారాయణ రెడ్డి – మైల రాంరెడ్డి కుటుంబ సభ్యులు పరామర్శించారు.ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి రూ.20,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బక్కమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.