గ్రామీణ పేదలకు మెరుగైన వైద్య సేవలు.. ఎస్వి ప్రజా వైద్యశాల లక్ష్యం
- బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరామర్శ - September 27, 2026
- చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామాకై కాంగ్రెస్ ధర్నా - September 27, 2026
- బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి మాజీమంత్రి కేటీఆర్ ఘన నివాళి - September 27, 2026

వెల్దండ: మండల కేంద్రంలోని పాత ఎస్బీఐ బ్యాంకు భవనంలో ఎస్.వీ. ప్రజా వైద్యశాల ఆదివారం ప్రారంభమైంది. ఎన్నమ్స్ అధినేత డాక్టర్ హరికాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్నం భూపతిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.అనంతరం ఆసుపత్రి యాజమాన్యం అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.గ్రామీణ పేదలకు సకాలంలో అత్యవసర వైద్య సేవలు అందించి, మెరుగైన చికిత్స అందించడమే ఆసుపత్రి లక్ష్యమని యాజమాన్యం తెలిపింది.ప్రతి నెల రెండో, నాలుగో శనివారాల్లో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని వెల్లడించింది.ఆసుపత్రిలో ఎంఎస్ జనరల్ అండ్ ల్యాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసులు, ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్ డాక్టర్ దినేష్ గౌడ్‌తో పాటు గైనకాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్ విభాగాలకు చెందిన వైద్య నిపుణుల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పురుషోత్తం చారి, మసిగుండ్ల వెంకటేష్, నాయకులు తిరుపతి రెడ్డి, మదన్ గౌడ్, కొయ్యల పుల్లయ్య, జంగిలి కొండలు తదితరులు పాల్గొన్నారు.
