అమ్మకు అక్షరమాల పరీక్షలు.. మహిళల బలోపేతమే సమాజానికి పునాది
- బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరామర్శ - September 27, 2026
- చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామాకై కాంగ్రెస్ ధర్నా - September 27, 2026
- బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి మాజీమంత్రి కేటీఆర్ ఘన నివాళి - September 27, 2026

వెల్దండ: మండలంలోని అన్ని గ్రామాల్లో ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో భాగంగా ఉల్లాస్ శిక్షణ ద్వారా మహిళా సంఘాల సభ్యులకు కనీస అక్షర పరిజ్ఞానం పెంపొందించేందుకు ఆదివారం ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమాన్ని సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళలు విద్యను అభ్యసిస్తే కుటుంబంతో పాటు సమాజంలోనూ వెలుగులు నింపుతారని అన్నారు. కార్యక్రమంలో డీపీఎం శ్రీనివాస్, ఏపీఎంలు జయమాలిని, సంతోష్‌కుమార్, వార్డు సభ్యులు పురుషోత్తం చారి, మసిగుండ్ల వెంకటేష్, నాయకులు పుల్లయ్య, జంగిలి కొండల్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
