Daily Archive: September 27, 2026
కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గం, కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ గ్రామానికి చెందిన కాటన్ మిల్లు కార్మికురాలు నిర్మల ఇంటి నిర్మాణం ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది.ఈ విషయాన్ని కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్య ప్రకాష్ రావు ద్వారా తెలుసుకున్న రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మల ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంటును అందజేశారు.ఈ…
వెల్దండ : ఖేలో ఇండియా రోడ్ సైక్లింగ్ రాష్ట్రస్థాయి పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థినులు ఎంపికయ్యారు. కే. మమత, పి. హాసిని, కే. అభిత, జీ. నందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ తెలిపారు.ఈ నెల 27, 28 తేదీల్లో నిజామాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి రోడ్ సైక్లింగ్ పోటీల్లో విద్యార్థినులు పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులను పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, పీఈటీ రవీందర్ అభినందించారు.
షాబాద్ మండలం,అంతారం గ్రామానికి చెందిన జిట్టా చంద్రశేఖర్,తండ్రి లక్ష్మయ్య, వయసు సుమారు 16 సంవత్సరాలు వృత్తి రీత్యా గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు మందలించినందుకు మనస్థాపానికి గురైనట్లు ప్రాథమికంగా తెలిసింది. ఈ క్రమంలో గ్రామ శివారులోని పంట పొలాల్లో చెట్టుకుఉరి వేసుకొని మృతి చెందినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.