Daily Archive: September 27, 2026

మొబైల్ ఫిలిం మేకింగ్ తో యువతకు సృజనాత్మకత కొత్త అవకాశాలు

నాగర్ కర్నూల్: విద్యార్థుల్లో ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, వారి సృజనాత్మకతను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ టాస్క్ కార్యాలయంలో మొబైల్ ఫిల్మ్ మేకింగ్ మరియు సినిమాటోగ్రఫీ వర్క్‌షాప్‌ను నిర్వహించామని టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పేర్కొన్నారు. కళాశాలలకు చెందిన 56 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈ వర్క్‌షాప్‌లో మొబైల్ ఫిల్మ్‌మేకింగ్,ఫోటోగ్రఫీ ప్రాథమిక అంశాలు, కెమెరా టెక్నిక్స్, ఫ్రేమింగ్, లైటింగ్,విజువల్ స్టోరీటెల్లింగ్, ప్రాథమిక సినిమాటోగ్రఫీ తదితర అంశాలపై విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రస్తుత…

ఎల్లారెడ్డి మున్సిపల్ భవన నిర్మాణం కై పిలుపు

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 29న వినతిపత్రం పై హైదరాబాద్‌లో లేబర్ కమిషనర్‌కు వినతి.. భారీ సంఖ్యలో తరలిరావాలని కార్మికులకు పిలుపుకామారెడ్డి, ఎల్లారెడ్డి. మున్సిపల్ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని కార్మిక అంజయ్య భవన్‌లో లేబర్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ( బి ఎన్ ఆర్ కే ఎస్ )…

కాంగ్రెస్ ప్రభుత్వం లోని ఆమనగల్ అభివృద్ధికి అడుగులు మున్సిపాలిటీ చైర్మన్ పత్యా నాయక్

ఆమనగల్లు: కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఎంపీ మల్లు రవి,ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆమనగల్లు వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆమనగల్ మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ అన్నారు.ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమనగల్ లో అదనపు సివిల్ కోర్టు మంజూరు చేయడం హర్షణీయమని,దూర ప్రాంతాలకు వెళ్లే స్థానిక ప్రజలకు దూరం తగ్గి ఆమనగల్లు లో వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సుమారు వారం రోజుల క్రితం అభివృద్ధి పనుల కోసం రెండు కోట్ల నిధులు…

బాపూజీ హోదా దక్కిన రెండో వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ.. మున్సిపాలిటీ చైర్మన్ ప్రత్య నాయక్

ఆమనగల్: ఆమనగల్ పట్టణంలో తెలంగాణ తొలి ఉద్యమకారులు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమంలో పద్మశాలి సంఘం యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో బాపూజీ హోదా దక్కిన రెండో వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, తెలంగాణ స్వరాష్ట్రం కోసం తన పదవిని సైతం తున ప్రాయంగా వదులుకున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శివలింగం,…

మోమిన్ పేట్: మహిళ సంఘాల సభ్యులకు అక్షర మాల పరీక్షలు

మోమిన్ పేట్ మండలకేంద్రం అన్ని  గ్రామాల  ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మకు అక్షర మాల కార్యక్రమంలో భాగంగా ఉల్లాస్ శిక్షణ ద్వారా మహిళ సంఘాల సభ్యులకు పరీక్ష నిర్వహించారు. మహిళలకు కనీస అక్షర పరిజ్ఞానం పెంపొందించేందుకు  ఈ రోజు అన్ని గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. మహిళలు విద్యావంతులైతే ఇక కుటుంబమే కాదు. మొత్తం సమాజమే అభివృద్ధి చెందుతుంది. సమాజంలో పురుషులతో సమానంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ మరియు విద్యా పరమైన అవకాశాలను పొందాలంటే ప్రతి మహిళకు అక్షర పరిజ్ఞానం అవసరం….

డిండి ఎత్తిపోతల రద్దు పాదయాత్రకు..ఎల్ హెచ్ పి ఎస్ మద్దతు

కల్వకుర్తి :డిండి ఎత్తిపోతల రద్దు డిమాండ్ చేస్తూ భూ నిర్వాసితులు ఉల్పర నుండి కల్వకుర్తికి చేపట్టిన మహా పాదయాత్రకు లంబాడి హక్కుల పోరాట సమితి చారకొండ మండల కమిటీ తరుపున మద్దతు ప్రకటించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవిలాల్ చౌహన్,మండల అధ్యక్షులు రామావత్ సాయికుమార్,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవి, అచ్చంపేట తాలూకా అధ్యక్షులు జుమ్లాల్ ,మండల కార్యదర్శి సరి రామ్ తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

డీసీసీ కార్యాలయంలో ఘనంగా సేవాదళ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సేవాదళ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ గారు జాతీయ జెండాను ఎగురవేశారు . సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గుగ్గిళ్ల ఆదినారాయణ,మాజీ జిల్లా అధ్యక్షుడు పారుపల్లి ప్రభాకర్ రెడ్డి,డీసీసీ ఉపాధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి, మైనార్టీ సెల్…

రేపటి ధర్నా–ర్యాలీని విజయవంతం చేయాలి

జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు టీపీసీసీ సభ్యులు, YTDA మెంబర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ పిలుపు. ఓట్ల చోరీ వ్యవహారం, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సెప్టెంబర్ 28న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28వ తేదీ ఉదయం 10:00 గంటలకు నెహ్రూ పార్క్ నుండి కలెక్టరేట్…

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 27:ఏఐసీసీ పిలుపు మేరకు రేపు (సోమవారం, సెప్టెంబర్ 28) ఉదయం 10 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితి విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ…