Daily Archive: September 27, 2026

బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరామర్శ

నాగర్ కర్నూల్ : పితృవియోగంతో బాధలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని ఆదివారం కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరామర్శించారు.కొల్లాపూర్ నియోజకవర్గం, సింగోటంలోని బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లి వారి తండ్రి దివంగత బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన వెంట పలువురు కల్వకుర్తి పట్టణ నాయకులు,బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

ఎన్నికల సంఘం జవాబుదారీతనం ఎక్కడ?

ఎన్నికల సంఘం జవాబుదారీతనం ఎక్కడ?ఓటు హక్కును కాపాడాల్సిన సంస్థే ప్రశ్నార్థకంగా మారడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం.గోవాలో 97 మంది ఓటర్ల వ్యవహారంపై సమాధానం చెప్పాలిటీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 27 : ఓటు హక్కును కాపాడాల్సిన ఎన్నికల సంఘం పనితీరుపైనే ప్రశ్నలు తలెత్తడం ప్రజాస్వామ్యానికి ఆందోళనకరమని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ అన్నారు. ఆదివారం నకిరేకల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల…

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామాకై కాంగ్రెస్ ధర్నా

నాగర్ కర్నూల్ : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని సెప్టెంబర్ 28న సోమవారం ఉదయం 9:00 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించ బడుతుందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు.ఈ ధర్నా కార్యక్రమం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు,అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు,పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి…

బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి మాజీమంత్రి కేటీఆర్ ఘన నివాళి

నాగర్ కర్నూల్ : కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి, సుపరిచితులైన బీరం లక్ష్మారెడ్డి ఇటీవల మరణించిన నేపథ్యంలో ఆయన దశదినకర్మ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.లక్ష్మారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి,ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్,సి. లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, విజయుడు,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు…

పాలమూరును కాపాడాలని పాదయాత్ర

కల్వకుర్తి సెప్టెంబర్ : పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి అక్రమంగా 30 టీఎంసీల నీటిని తరలించి పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చే కుట్రను వ్యతిరేకిస్తూ, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.ఉల్పర నుంచి కల్వకుర్తి వరకు చేపట్టిన ఈ పాదయాత్రలో బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి…

మల్టీ స్టార్ గల్లీ గణేష్ 14వ రోజు నిమజ్జన వేడుకలు

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మాందాపూర్ గ్రామంలో 11వ వార్డులో మల్టీ స్టార్ గల్లీ గణేష్ నిమర్జన ఉత్సవాలు 14 రోజులలో ఆటపాటలతో ఘనంగా ఊరేగుతు సాగుతుంది. దాదాపుగా అన్ని గణపతులు 11 రోజులలో నిమజ్జనం అయ్యాయి కానీ మల్టీ స్టార్ గల్లీ గణేష్ చాలా అద్భుతంగా కొత్త ఉత్సాహంతో ఊరిలో వాతావరణం ఉంది. ఈ సందర్భంగా లడ్డు వేలం పాటను లక్కీ డ్రా ద్వారా ఉచితంగా తీయడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలియజేశారు.

జూపల్లిలో భక్తిశ్రద్ధలతో గ్యార్మీ వేడుకలు.. హాజరైన భాస్కరరావు

చారగొండ సెప్టెంబర్ 27: చారగొండ మండలంలోని జూపల్లి గ్రామంలో గ్యార్మి వేడుకలను ముస్లిం యువకులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఖాదీర్ ముస్లింలు పాటించాలని పలువురు ముస్లిం మత పెద్దలు కోరారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాప ప్రక్షాళన గ్యారి షరీఫ్ ఉద్దేశమని ఆర్థిక లాభాలు వ్యక్తిగత స్వార్థాలతో ఆందోళన చెందుతున్న ఆధునిక సమాజంలో ఆధ్యాత్మిక చింతన పండుగ ప్రబోధిస్తుందని అన్నారు….

అసంపూర్తి గృహ నిర్మాణాలకు ఉప్పల వెంకటేష్ సిమెంట్ అందజేత

కల్వకుర్తి సెప్టెంబర్ 27: కల్వకుర్తి మండలంలోని గుండూరు గ్రామంలో అసంపూర్తిగా ఉన్న 03 ఇండ్ల నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో మూడు ఇండ్లు సంపంగి శివ,ఆఫీసు శ్రీను, గోరేటి చిన్న చెన్నయ్యలకు సిమెంటును అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాష్ రావు, బిఆర్ఎస్ నాయకులు…

జాఫర్‌ఘడ్ సబ్ మార్కెట్ యార్డును అభివృద్ధి చేసి రైతుల సమస్యలు పరిష్కరించాలి

జాఫర్‌ఘడ్ సబ్ మార్కెట్ యార్డును అభివృద్ధి చేసి రైతుల సమస్యలు పరిష్కరించాలి