ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి సెప్టెంబర్ 29 : ఉపాధ్యాయుల సేవలను గుర్తించి ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఉపాధ్యాయ వృత్తి అత్యంత గౌరవ ప్రదమైనదని, విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అందిస్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలోని దేవకీ ఫంక్షన్ హాల్‌లో మండల పార్టీ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని…
