Daily Archive: September 30, 2026
నాగర్‌కర్నూల్: గ్యాస్ వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్లకు ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి సూచించారు. అక్రమ గ్యాస్ కనెక్షన్లను అరికట్టడంతో పాటు ప్రభుత్వ రాయితీల దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ–కేవైసీ ప్రక్రియను చేపట్టిందని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను పొందాలంటే గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసి ఈ–కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఏడాదికి పైగా బయోమెట్రిక్ ఈ–కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఇంకా 100 శాతం పూర్తికాలేదన్నారు. అక్టోబర్ 1 వరకు తుది…
బాన్సువాడ, సెప్టెంబర్ 30: తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధి పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పోచారం వివరించారు. తిమ్మాపూర్ ఆలయాన్ని “తెలంగాణ తిరుపతి”గా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలను తెలిపారు. అనంతరం…
నాగర్ కర్నూల్ : సెప్టెంబర్ 30, 2012 ఆంక్షలను, నిర్బంధాలను, ముళ్లకంచెలను, లాఠీచార్జీలను, రబ్బర్ బుల్లెట్లను లెక్కచేయకుండా.. హుస్సేన్‌సాగర్ తీరం ‘జై తెలంగాణ’ నినాదాలతో మార్మోగింది.ఉమ్మడి పాలకుల కుట్రలను తిప్పికొడుతూ.. ఉద్యమకారులు, తెలంగాణవాదులు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన చారిత్రక ఘట్టం ఇది.తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో సాగరహారం కీలక ఘట్టంగా నిలిచింది.
ఆమనగల్: కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మండలంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కలకొండ యాదగిరి ఆధ్వర్యంలో బుధవారం ఆమనగల్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న, రాష్ట్ర అధ్యక్షులు కేదాస్ మోహన్ ఆదేశాల మేరకు నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఆమనగల్ మండల అధ్యక్షునిగా కంబాలపల్లి ప్రవీణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వెంటనే అమలు చేయాలని, చేవెళ్ల డిక్లరేషన్ సాక్షిగా…
రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాడుగుల గ్రామ మాజీ ఎంపీటీసీ పులి కంటి లక్ష్మి కుటుంబాన్ని చరవాణి ద్వారా పరామర్శించారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చల్లా వంశీ చంద్ రెడ్డి మంగళవారం లక్ష్మమ్మ భర్త ప్రముఖ దళిత ఉపాధ్యాయ సంఘం నాయకులు మరియు వ్యక్తిగతంగా అత్యంత సుపరిచితులైన పరిచయమైన పులికంటి లక్ష్మయ్య ను చరవాణిలో సంప్రదించి, అకాల మరణం పట్ల సానుభూతి తెలిపారు.
ఆమనగల్లు: మండలం పోలేపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామ సర్పంచ్ వెంకటయ్య డిమాండ్ చేశారు. ఆమనగల్లు నుంచి పోలేపల్లి వరకు బస్సులు నడపడంతో పాటు గిరికొత్తపల్లి వైపు వెళ్లే బస్సులను పోలేపల్లి మీదుగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సమస్యపై ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందించడంతో పాటు మహేశ్వరం ఆర్టీసీ డిపో అధికారులకు కూడా వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. ఆమనగల్లు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో బస్సు సౌకర్యంపై చర్చ జరగగా, పది…
కల్వకుర్తి: తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన నూకం శేఖర్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు.మంగళవారం వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. శేఖర్ మరణించడం చాలా బాధాకరమని వారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు జిల్లా నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు ఉపసర్పంచ్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.