మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుడి ఆర్థికసాయం
- మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుడి ఆర్థికసాయం - September 10, 2026
- ఈ నెల 10,11న మండల స్థాయి ఎస్ జీఎఫ్ క్రీడలు : ఎంఈఓ అంజయ్య - September 10, 2026
- సీపీఎం సీనియర్ నాయకుడు మృతి - September 10, 2026
మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుడి ఆర్థికసాయం
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 10 : మండలంలోని చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన దేవరకొండ గోపి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కక్కిరేణి నవీన్ గౌడ్ గురువారం పార్టీ నాయకులతో కలిసి మృతుడి ఇంటికి వెళ్లి గోపి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారుజ అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి తన వంతుగా రూ.20 వేల ఆర్థికసాయాన్ని మృతుడి తల్లి బుచ్చమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ గౌడ్ మాట్లాడుతూ కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలువడం ప్రతి ఒక్కరి భాద్యత అన్నారు. నివాళులర్పించిన వారిలో గుండగోని రాములు, దుబ్బ గిరి, కిరణ్, నరేష్, నవీన్ రెడ్డి, పవన్, శివాజీ తదితరులు ఉన్నారు.
